ముగించు

జిల్లా బిసి అభివృద్ధి కార్యాలయం

డిపార్ట్ మెంట్ యొక్క కార్యకలాపాలు :

  1. మెట్రిక్ పూర్వ మరియు మెట్రిక్ అనంతర వసతి గృహములు
  2. మెట్రిక్ పూర్వ ఉపకార వెతనములు
  3. మెట్రిక్ అనంతర ఉపకార వెతనములు
  4. మహాత్మా జ్యోతిబా పూలే బిసి ఓవర్సీస్ విద్యానిధి పథకము
  5. కులాంతర వివాహములు చేసుకున్న జంటలకు ప్రోత్సాహకాలు
  6. శిక్షణా న్యాయవాదులకు స్టైఫండ్
  7. బిసి స్టడీ సర్కీల్ ద్వారా ఉద్యోగార్ధులకు శిక్షణా తరగతులు
  8. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాలు
  9. కళ్యాణ లక్ష్మి పథకము
  10. మార్జిన్ మని మరియు సావిత్రి బాయి ఫులే అభ్యుదయ యోజన పథకము
  11. దోభిఘాట్ల నిర్మాణము
  12. (11) ఫేడరేషన్స్ పథకము

డిపార్ట్ మెంట్ పథకాల గురించి వివరణ మరియు సంబంధిత దరఖాస్తులు:

  1. మెట్రిక్ పూర్వ మరియు మెట్రిక్ అనంతర వసతి గృహములు:-

    జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి కార్యాలయము ౩వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుచున్న వెనుక బడిన తరగతుల విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి, పుస్తకములు, నోట్ పుస్తకములు మరియు యునిఫారంలు అందజేయుచున్నది. ఇంటర్మీడియట్ మరియు ఆ తర్వాతి కోర్సులు చదువుచున్న వెనుక బడిన తరగతుల విద్యార్థులకు భోజనం మరియు వసతి కల్పించుచున్నది.

  2. మెట్రిక్ పూర్వ ఉపకార వెతనములు :-

    జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయము ప్రభుత్వ పాటశాలలలో 9వ తరగతి మరియు 10వ తరగతి చదువుచున్న వెనుక బడిన తరగతుల విద్యార్థులకు ఒక్కోక్కరికి రూ. 1000/- ల చొప్పున ఉపకార వెతనములు మంజూరు చేయుచున్నది.

  3. మెట్రిక్ అనంతర ఉపకార వెతనములు :-

    జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయము ఇంటర్మీడియట్ మరియు ఆ తర్వాతి కోర్సులు చదువుచున్న వెనుకబడిన తరగతుల మరియు ఆర్ధికముగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ట్యుషన్ ఫీజుల తిరిగి చెల్లింపు మరియు నిర్వహణ ఖర్చులు ఉపకార వెతనములుగా మంజూరు చేయుచున్నది.

  4. మహాత్మా జ్యోతిబా పూలే బిసి ఓవర్సీస్ విద్యానిధి పథకము :-

    జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయము ద్వారా USA, U.K, AUSTRALIA, CANADA, SINGAPORE, GERMANY, NEW ZEELAND, JAPAN, FRANCE, SOUTH KOREA తదితర దేశాలలో ఉన్నత విధ్యాభాసము చేయుటకు డిగ్రీ పూర్తీ చేసి GRE, TOFEL & IELTS లలో అర్హత సాధించిన వెనుకబడిన తరగతుల మరియు ఆర్ధికముగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రూ.20.00 లక్షల ఆర్ధిక సహాయము మంజూరు చేయబడుచున్నది.

  5. కులాంతర వివాహములు చేసుకున్న జంటలకు ప్రోత్సాహకాలు :-

    జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయము ద్వారా కులాంతర వివాహములు చేసుకున్న వెనుకబడిన తరగతుల జంటలకు రూ. 10,000/- ల చొప్పున ప్రోత్సహక బహుమతి మంజూరు చేయబడుచున్నది.

  6. శిక్షణా న్యాయవాదులకు స్టైఫండ్ :-

    జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయము ద్వారా వెనుకబడిన తరగతుల శిక్షణా న్యాయవాదులకు వారి శిక్షణ కాలములో 3 సంవత్సరాల పాటు నెలకు రూ.1000/- ల చొప్పున స్టైఫండ్ మంజూరు చేయబడుచున్నది.

  7. బిసి స్టడీ సర్కీల్ ద్వారా ఉద్యోగార్ధులకు శిక్షణా తరగతులు :-

    బిసి స్టడీ సర్కీల్ ద్వారా వెనుకబడిన తరగతుల మరియు ఆర్ధికముగా వెనుకబడిన తరగతుల ఉద్యోగార్ధులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందుటకు శిక్షణా తరగతులు నిర్వహింపబడుచున్నవి. స్టడీ మేటిరియల్ తో పాటు శిక్షణా సమయములో మధ్యాహ్న భోజనము కూడా అందజేయబడుచున్నది.

  8. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాలు :-

    మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాలలో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు మరియు
    ఇంటర్మీడియట్ కోర్సు చదువుచున్న వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, పుస్తకములు, నోట్ పుస్తకములు మరియు యునిఫారంలు అందజేయబడుచున్నది.

  9. కళ్యాణ లక్ష్మి పథకము :-

    తెలంగాణ రాష్ట్రములోని వెనుకబడిన తరగతుల మరియు ఆర్ధికముగా వెనుకబడిన తరగతుల బాలికలకు వారి వివాహ నిమిత్తం రూ.75,116/- లు ఆర్ధిక సహాయము మంజూరు చేయబడుచున్నది. ఇటీవల ఇట్టి మొత్తము రూ.1,00,116/- లకు పెంచబడినది.

  10. మార్జిన్ మని మరియు సావిత్రి బాయి ఫులే అభ్యుదయ యోజన పథకము :-

    జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయము ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న వెనుకబడిన తరగతుల వారికి వారి జీవనోపాధి కొరకు మార్జిన్ మని పథకము క్రింద సబ్సిడి మంజూరు చేయబడుచున్నది. పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వెనుకబడిన తరగతుల వారికి సావిత్రి బాయి ఫులే అభ్యుదయ యోజన పథకము పథకము క్రింద సబ్సిడితో కూడిన రుణాలు మంజూరు చేయబడుచున్నవి.

  11. దోభిఘాట్ల నిర్మాణము :-

    జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయము ద్వారా రజకులు తమ వృత్తి పని చేసుకొనుటకు రూ.5.60 లక్షల వ్యయముతో దోభిఘాట్ల నిర్మాణము చేయుచున్నది.

  12. (11) ఫేడరేషన్స్ పథకము :-

    జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయము ద్వారా రజక, నాయిబ్రాహ్మణ, ఒడ్డెర, సాగర-ఉప్పేర, వాల్మికి బోయ, కృష్ణబలిజ-పూసల, బట్రాజ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి శాలివాహన, మేదర, గీత కార్మికులు మొదలగు (11) కుల సంఘాల వారు సమిష్టీగా కాని వ్యక్తిగతముగా కాని జీవనోఫాది పొందుటకు ఒక్కొక్క సంఘానికి రూ.౩౦.౦౦ లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయబడుచున్నది.

వివిధ పథకాల ప్రగతి నివేదిక :-

    1. మెట్రిక్ పూర్వ మరియు మెట్రిక్ అనంతర వసతి గృహములు :-

      ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో (19) మెట్రిక్ పూర్వ వసతి గృహములు మరియు (13) మెట్రిక్ అనంతర వసతి గృహములు నడుపబడుచున్నవి. మెట్రిక్ పూర్వ వసతి గృహాలలో (1741) మంది విద్యార్థులు మరియు మెట్రిక్ అనంతర వసతి గృహాలలో (1374) మంది విద్యార్థులు ఉచిత భోజన, వసతి మరియు ఇతర సదుపాయములను పొందుచున్నారు. పూర్తి వివరములు క్రింది విధముగానున్నవి.

      మెట్రిక్ పూర్వ మరియు మెట్రిక్ అనంతర వసతి గృహములు-పూర్తి వివరములు
      క్ర.స. ప్రభుత్వ వె.బ.త వసతి గృహాలు మొత్తం వసతి గృహాలు ప్రభుత్వ భవనములలో నడుప బడుతున్నవి ప్రైవేటు భవనములలో నడుప బడుతున్నవి మంజూరైన విద్యార్థుల సంఖ్య వసతి పొందుతున్న విద్యార్థుల సంఖ్య ఖాళీల సంఖ్య
      బాలుర బాలికల
      1 మెట్రక్ పూర్వ వసతి గృహాలు 12 04 15 01 1580 1195 385
      2 మెట్రక్ పూర్వసమీకృత వసతి గృహాలు 02 01 03 0 1000 546 454
      3 మెట్రక్ అనంతర వసతి గృహాలు 06 07 04 09 1300 1374 (-74)
      మొత్తం 20 12 22 10 3880 3115 839
    2. మెట్రిక్ పూర్వ ఉపకార వెతనములు :-

      ప్రస్తుతం విద్యా సంవత్సరం 2017-18 లో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉపాకార వేతనములు మంజూరి చేయుటకు గాను జిల్లాకు రూ. 10.29 లక్షలు విడుదల కాగా దరఖాస్తు చేసుకున్న (1270) మంది వెనుకబడిన తరగతుల విద్యార్థులలో (885) మంది వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రూ. 8.85 లక్షల ఉపకార వేతనములు మంజూరు చేయూట జరిగినది.

    3. మెట్రిక్ అనంతర ఉపకార వెతనములు :-

      ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2017-18 లో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నిర్వహణ ట్యుషన్ ఫీజు నిమిత్తం జిల్లాకు రూ. 11.58 లక్షలు విడుదల కాగా ఇట్టి మొత్తము పూర్తిగా (28,844) మంది 2016-17 విద్యా సంవత్సరపు వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మంజూరు చేయూట జరిగినది.అంతేకాకుండా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ట్యుషన్ ఫీజు తిరిగి చెల్లింపు నిమిత్తం జిల్లాకు రూ. 17.31 లక్షలు విడుదల కాగా ఇట్టి మొత్తము పూర్తిగా (21,156) మంది 2016-17 విద్యా సంవత్సరపు వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మంజూరు చేయూట జరిగినది.

      అదేవిధంగా ఆర్ధికముగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ట్యుషన్ ఫీజు తిరిగి చెల్లింపు నిమిత్తం జిల్లాకు రూ. 267.91 లక్షలు విడుదల కాగా, ఇంతవరకు (1960) మంది 2016-17 విద్యా సంవత్సరపు ఆర్ధికముగా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు రూ. 264.95 లక్షలు మంజూరు చేయూట జరిగినది.

    4. మహాత్మా జ్యోతిబా పూలే బిసి ఓవర్సీస్ విద్యానిధి పథకము :-

      ఈ పథకము క్రింద గడిచిన ఆర్ధిక సంవత్సరము 2016-17 లో (13) మంది వెనుకబడిన తరగతుల విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసము చేయుటకు ఆర్ధిక సహాయము కొరకు దరఖాస్తు చేసుకోనగా వారిలో ఈ క్రింది (8) మంది వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20.00 లక్షల చొప్పున ఆర్ధిక సహాయము మంజూరు చేయుట జరిగినది.

      మహాత్మా జ్యోతిబా పూలే బిసి ఓవర్సీస్ విద్యానిధి పథకము వివరములు
      క్ర.స. విద్యార్థి పేరు మరియు తండ్రి పేరు గ్రామము / మండలము నియోజకవర్గం కోర్సు పేరు దేశము పేరు
      1 బి మనీషా / శ్రీనివాస్ పెర్కిట్ (గ్రా)ఆర్మూర్ (మం,,) ఆర్మూర్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
      2 యన్. విశ్వనాథ్ / గోపాల్ ఎడపల్లి (గ్రా,,)  & (మం,,) బోధన్ మాస్టర్ ఆఫ్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఆస్ట్రేలియా
      3 జి. మనోజ్ / గంగాధర్ ధర్మారం (గ్రా,,)

      డిచ్ పల్లి  (మం,,)

      నిజామాబాద్ గ్రామీణ మాస్టర్ ఇన్ టెక్నాలజీ ఆస్ట్రేలియా
      4 బి నరేంద్ర కుమార్ / నారాయణ మామిడిపల్లి (గ్రా,,)  ఆర్మూర్ (మం,,) ఆర్మూర్ మాస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ ఆస్ట్రేలియా
      5 కిరణ్ పాటిల్ / రమేష్ ఖండ్ గావ్  (గ్రా,,)

      బోధన్ (మం,,)

      బోధన్ మాస్టర్ ఆఫ్ ప్రోపెషనల్ అక్కౌంటింగ్ ఆస్ట్రేలియా
      6 క్రిష్టాపురం లక్ష్మి నిఖిల్ బాబు / కుమార్ బాబు నవీపేట్ (గ్రా,,)  & (మం,,) బోధన్ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
      7 సాయికృష్ణ గొల్లపల్లి / సుధాకర్ గౌడ్ రెంజర్ల (గ్రా)ముప్కాల్ (మం) బాల్కొండ బిజినెస్ అనాలిటిస్క్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు
      8 నాంపల్లి సిద్దార్థ / బహాదూర్ శాస్త్రి మాక్లూర్ (గ్రా)  &(మం) నిజామాబాద్ గ్రామీణ మాస్టర్ ఇన్ ప్రోపెషనల్ ఇంజనీరింగ్ ఆస్ట్రేలియా

      ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2017-18 లో ఇంతవరకు (21) మంది వెనుకబడిన తరగతుల విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసము చేయుటకు ఆర్ధిక సహాయము మంజూరి నిమిత్తం ఆన్ లైన్ లో వారి దరఖాస్తులను రిజిస్టర్ చేసుకోనగా వారి ఆర్ధిక స్థితిగతులపై విచారణ నిర్వహించి కమీషనర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ గారికి నివేదిక సమర్పించుట జరిగినది.

    5. కులాంతర వివాహములు చేసుకున్న జంటలకు ప్రోత్సాహకాలు :-

      ఈ పథకము క్రింద గడిచిన ఆర్ధిక సంవత్సరము 2016-17 లో (15) మంది కులాంతర వివాహములు చేసుకున్న వెనుకబడిన తరగతుల జంటలకు రూ. 4.07 లక్షలు మంజూరు చేయుట జరిగినది.

      ఆర్ధిక సంవత్సరము 2015-16 మరియు 2016-17 లలో జిల్లాకు విడుదల అయిన నిధులు మరియు ఖర్చు చేయబడిన నిధులతో పాటు ఇట్టి ప్రోత్సాహక బహుమతి మంజూరి నిమిత్తము ఈ కార్యాలయమునకు అందిన దరఖాస్తులు, మంజురైన దరఖాస్తులు మరియు పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరములు ఈ క్రింది విధముగా ఉన్నవి.

       
      క్ర.స. 2015-16 & 2016-17 లలో విడుదలైన నిధులు ఖర్చు చేయబడిన నిధులు దరఖాస్తుల సంఖ్య
      అందినవి మంజురైనవి పెండింగ్ లో ఉన్నవి
      1 రూ. 9,82,500/- రూ. 45,000/- 65 46 19
    6. శిక్షణా న్యాయవాదులకు స్టైఫండ్ :-

      ఈ పథకము క్రింద జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయము ద్వారా వెనుకబడిన తరగతుల శిక్షణా న్యాయవాదులకు వారి శిక్షణ కాలములో 3 సంవత్సరాల పాటు నెలకు రూ.1000/- ల చొప్పున స్టైఫండ్, పుస్తకముల కొనుగోలుకు రూ.3000/- లు మరియు వారి పేరు నమోదు చేసుకొనుటకు చెల్లింపు చేయవలసిన రూ.585/- లు కూడా మంజూరు చేయబడుచున్నది.

      2016-17 ఆర్ధిక సంవత్సరములో ఇద్దరు వెనుకబడిన తరగతుల శిక్షణా న్యాయవాదులు ఇట్టి స్టైఫండ్ మంజూరి నిమిత్తం దరఖాస్తు చేసుకోనగా వారి వయస్సు 35 సం,,లు దాటినందువలన వారికీ ఇట్టి స్టైఫండ్ మంజూరు చేయుట జరుగలేదు కాని ఇంతకు పూర్వం స్టైఫండ్ మంజూరి చేయబడిన (7) గురు శిక్షణా న్యాయవాదులకు చెల్లించవలసిన బకాయిలు రూ.35,750/- లు మంజూరు చేయుట జరిగినది.

    7. బిసి స్టడీ సర్కీల్ ద్వారా ఉద్యోగార్ధులకు శిక్షణా తరగతులు :-

      జిల్లాలో 2010-11 ఆర్ధిక సంవత్సరములో ప్రారంభించబడిన బిసి స్టడీ సర్కీల్ ద్వారా వెనుకబడిన తరగతుల మరియు ఆర్ధికముగా వెనుకబడిన తరగతుల ఉద్యోగార్ధులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందుటకు శిక్షణా తరగతులు నిర్వహింపబడుచున్నవి. స్టడీ మేటిరియల్ తో పాటు శిక్షణా సమయములో మధ్యాహ్న భోజనము కూడా అందజేయబడుచున్నది.

      ఇంతవరకు ఈ సంస్థ ద్వారా శిక్షణ పొందిన (144) మంది వెనుకబడిన తరగతుల అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందుట జరిగినది. జిల్లాలో ఈ కార్యాలయ భవన నిర్మాణ నిమిత్తము రూ.3.65 కోట్లు ప్రభుత్వం విడుదల చేయుట జరిగినది.

    8. మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాలు :-

      నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం గడచిన విద్యా సంవత్సరం 2017-18 లో (5) గురుకుల విద్యాలయాలను ప్రారంబించుట జరిగినది. ఇదివరకే జిల్లాలో (1) గురుకుల విద్యాలయము పని చేయుచున్నది. నియోజక వర్గాల వారిగా జిల్లాలో పని చేయుచున్న గురుకుల విద్యాలయాల వివరములు క్రింది విధముగా ఉన్నవి.

       
      క్ర.స. గురుకుల విద్యాలయము పేరు / నడుపబడుతున్న ప్రదేశము మండలము నియోజకవర్గం మంజూరైన విద్యార్థుల సంఖ్య ప్రవేశం పొందిన విద్యార్థుల సంఖ్య
      1 ప్రభుత్వ వెబత బాలికల గురుకుల విద్యాలయము, నిజామాబాద్ నిజామాబాద్(పట్టణ) నిజామాబాద్ (పట్టణ) 240 209
      2 ప్రభుత్వ వెబత బాలికల గురుకుల విద్యాలయము, చిమన్ పల్లి సిరికొండ నిజామాబాద్ (గ్రామీణ) 240 165
      3 ప్రభుత్వ వెబత బాలుర గురుకుల విద్యాలయము, ఎడపల్లి ఎడపల్లి బోధన్ 240 218
      4 ప్రభుత్వ వెబత బాలుర గురుకుల విద్యాలయము, మోర్తాడ్ మోర్తాడ్ బాల్కొండ 240 172
      5 ప్రభుత్వ వెబత బాలుర గురుకుల విద్యాలయము, ఖుద్వాన్ పూర్ నందిపేట్ ఆర్మూర్ 240 211
      6 ప్రభుత్వ వెబత గురుకుల విద్యాలయము, కంజర మోపాల్ నిజామాబాద్ (గ్రామీణ) 480 451
      7 ప్రభుత్వ వెబత గురుకుల కళాశాల కంజర మోపాల్ నిజామాబాద్ (గ్రామీణ) 120 63
    9. కళ్యాణ లక్ష్మి పథకము :-
      క్ర.స. రెవెన్యూ డివిజన్ పేరు మొత్తం దరఖాస్తులు తిరస్కరించబడిన దరఖాస్తులు తహశీల్దారు వద్ద పెండింగ్ లో ఉన్నవి తహశీల్దారు చే పరిశీలించ బడినవి శాసన సభ్యులచే పరిశీలించ బడినవి మంజూరై  ఆఫ్ లోడ్ నిమిత్తం పెండింగ్ లో ఉన్న బిల్లులు ట్రెజరీలో పెండింగ్ లో ఉన్న బిల్లులు ట్రెజరీ ద్వారా పాస్ చేయబడిన బిల్లులు
      1 ఆర్మూర్ 1948 73 77 1798 1621 1359 1359 1359
      2 బోధన్ 969 39 45 885 850 668 666 666
      3 నిజామాబాద్ 2281 60 129 2092 1873 1718 1718 1718
      మొత్తం 5198 172 251 4775 4344 3745 3743 3743
    10. మార్జిన్ మని మరియు సావిత్రి బాయి ఫులే అభ్యుదయ యోజన పథకము :-

      ఈ పథకము క్రింద గడిచిన ఆర్ధిక సంవత్సరము 2015-16 లో (887) మంది వెనుకబడిన తరగతుల వారికి రూ. 639.68 లక్షల సబ్సిడీ మంజూరి చేయవలసి యుండగా (780) వెనుకబడిన తరగతుల వారికి రూ. 662.338 లక్షల సబ్సిడీ మంజూరి చేయూట జరిగినది. అట్టి మొత్తములో ఇంతవరకు (619) మంది లబ్దిదారులకు రూ. 514.738 లక్షలు వినియోగం జరిగినది.

    11. దోభిఘాట్ల నిర్మాణము :-

      ఈ పథకము క్రింద గడిచిన ఆర్ధిక సంవత్సరము 2015-16 లో (4) దోభిఘాట్ల నిర్మాణమునకు గాను రూ.21.268 లక్షలు విడుదల చేయుట జర్గినది.

    12. (11) ఫేడరేషన్స్ పథకము :-

      ఈ పథకము క్రింద గడిచిన ఆర్ధిక సంవత్సరము 2015-16 లో (40) వివిధ వెనుకబడిన తరగతుల కుల సంఘాలకు రూ.600.00 లక్షలు మంజూరి చేయవలసి యుండగా (32) వివిధ వెనుకబడిన తరగతుల కుల సంఘాలకు రూ.363.00 లక్షలు మంజూరి చేయూట జరిగినది. అట్టి మొత్తములో ఇంతవరకు (16) కుల సంఘాలకు రూ. 147.251 లక్షలు విడుదల చేయబడగా (9) కుల సంఘాలకు గాను రూ.84.75 లక్షల వినియోగం జరిగినది.