ముగించు

విద్య

విద్యాశాఖ గురించి:

స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేదిప్రాధమిక మరియు సెకండరి దశలనుకలిగి ఉన్నఅతిపెద్ద విభాగము. విద్యాశాక ముఖ్యంగా పిల్లలకు కనీస అత్యవసర సాధారణ విద్యను అందచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు గాను 6 నుండి 14 సం. వయస్సు గల పిల్లలను సమర్ధవంతమైన ఉత్పాదక పౌరులుగా తీర్చిదిద్ది, అవసరమైన సామర్ద్యాలను పెంపొందించి వాటిని సద్వినియోగం చేసుకోవటానికి గాను జాతీయ విద్యా విదాన నమూనా 10 + 2 + 3 ను రాష్ట్ర విద్యాశాక స్వీకరించింది. ఈ విధానంలో 10 సం.లు పాటశాల విద్యాకాలం ఇందులో మొదటి 5 సం. ప్రాధమిక స్థాయి (1వ. తరగతి – 5వ. తరగతి) తరువాత 2సం. ప్రాధమికోన్నత స్థాయి (6వ. మరియు – 7వ. తరగతి) మిగిలిన 3సం. (8వ, 9వ మరియు 10వతరగతులు) ఉన్నత స్తాయిలుగా విభజించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యనిర్వాహక వ్యవస్థ చేసిన పర్యవేక్షణ ఫలితంగా లోటు పాట్లను గుర్తించి రాష్ట్రంలోని బడిఈడు పిల్లలకు విద్యను అందుబాటులోకి తేవటానికి వారి నివాస ప్రాంతంలోనే, గిరిజన కొండ ప్రాంతాలను కూడా కలుపుకొని పాటశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కి.మీ పరిధిలో కనీసం ఒక ప్రాధమిక పాటశాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రం విద్యా సౌకర్యాల కల్పనలో 100% ఫలితాలను సాధించింది. నేడు రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి చెందిన వారైనా పాటశాల విద్యను పొందే అవకాసం ఉన్నది. రాష్ట్రంలోని మైనారిటీలు మరియు ఇతర వెనుకబడిన తరగతుల వారితో సహా బడి ఈడు పిల్లలకు విద్యాశాక గుణాత్మాక విద్యను 1నుండి 10వ. తరగతి వరకు ఉచితంగా అందిస్తుంది.

స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య లక్ష్యాలు

  1. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యొక్క యూనివర్సలైజేషన్
  2. యూనివర్సలైజేషన్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్

పై లక్ష్యాలను చేరుకోవటానికి / సాధించటానికి విద్యాశాఖ క్రింది కార్యకలాపాలను నిర్వహిస్తూ వుంది.

  1. 6 నుండి 14 సం. లోపు ఉన్న పిల్లలందరినీ పాఠశాలల్లో నమోదు అయ్యేలా చూడటం.
  2. 1 నుండి 10 తరగతుల వరకు నాణ్యమైన విద్యను అందిచటం.
  3. సాహిత్య అభివృద్ధి, గణిత మెళకువలు, సామాజిక అవగాహనను పిల్లల్లో పెంపొందిచటం.
  4. సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలకు అందిచటం.
  5. సహకారం, వ్యక్తిగత నిగ్రాహన, సహనం మొదలైన వాటిని విద్యార్థులలో పెంపొందిచటం.
  6. వృత్తి విద్యా సామర్థ్యం మరియు ఉత్పాదకతను ప్రోత్సహించడం.
  7. సామాజిక, పారిశ్రామిక మరియు సాంస్కృతిక న్యాయకత్వ లక్షణాలను పెంపొందిచటం.
  8. విద్యార్థులకు ఉన్నత విద్య అందిచడానికి వారిని సన్నద్ధం చేయడం.
  9. ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయిలలో ఉపాద్యాయ విద్యను అందిచడం.

విద్యాశాఖ పరిపాలన అమరిక :

జిల్లా స్థాయిలో :

  1. జిల్లా స్థాయిలో జిల్లా విద్యా అధికారి (డీ.ఇ.ఓ) జిల్లా విద్యా పరిపాలన అధిపతి. డీ.ఇ.ఓ గారు పరిశీలనాధికారి, విద్యావేత్త మరియు వ్యవస్థ నిర్వాహకులు.
  2. డీ.ఇ.ఓ గారు జిల్లా విద్యాశాఖ నిర్వహణకు మార్గదర్శకం వహిస్తూ, చట్టపరమైన విషయాలలో మరియు యం.డి.యం కు సంబంధించిన విషయాలు చుసుకోవటంలో సహాయకులుగా ఉంటారు.
  3. డీ.ఇ.ఓ గారు 7 మరియు 10 వ తరగతుల పబ్లిక్ పరిక్షలకు సంబంధించిన పనిలో అసిస్టెంట్ కమిషనర్ కి కూడా సహాయకులుగా
    ఉంటారు.

మండల స్థాయిలో :

  1. మండల స్థాయిలో మండల విద్యాధికారి (యం.ఇ.ఓ) గారు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తూ వుంటారు.
  2. యం.ఇ.ఓ గారు వారి మండల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పర్యవేక్షిస్తూ ఉంటారు.
  3. మండల స్థాయి విద్యా విధానాన్ని బలోపేతం చేయడానికి, మండల విధ్యాదికారి, పాఠశాలల డిప్యూటి ఇన్స్పెక్టర్ పోస్టులను 1998 లో గెజిటెడ్ హోదా

    కల్పించటం జరిగింది.

జిల్లా బౌగోళిక స్వరూపం మరియు సరిహద్దులు :

నిజామాబాద్ జిల్లా ఉత్తర సరిహద్దులో నిర్మల్ జిల్లా మరియు తూర్పున జగిత్యాల్, రాజన్న సిరిసిల్లా జిల్లాలు, పశ్చిమ మరియు దక్షిణాన కామారెడ్డి జిల్లాలు ఉన్నాయి. జిల్లా యొక్క బౌగోళిక ప్రాంతం 4288 చ.కి.మీ. మొత్తం అటవీ ప్రాంతం బౌగోళిక ప్రాంతంలో 19.90% (853.21 చ.కి.మీ.) జిల్లాలో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నాయి. కనీస ఉష్ణోగ్రత 13.7 0C మరియు గరిష్ట ఉష్ణోగ్రత సగటున 39.9 0 C వుంటుంది. కొన్ని సమయాలలో ఉష్ణోగ్రతలు శీతాకాలంలో 5 0 C కంటే తక్కువగాను వేసవిలో 47 0 C కంటే ఎక్కువగాను పెరుగుతుంది.

విద్యావాలంటీర్లు :

  1. కమిషనర్ & స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ & ఎక్స్-అఫీషియో
    రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్, తెలంగాణ హైదరాబాద్ వారి నుండి మొదటి విడతలో 145,
  2. రెండవ విడతలో 40 చొప్పున మొత్తం 185 విద్యావాలంటీర్ పోస్టులు జిల్లాకు మంజూరు చేయటం జరిగింది.
  3. జిల్లాకు మంజురైన మొత్తం విద్యా వాలంటీర్ పోస్టలు – 185
  4. జిల్లాకు నియామకమై పనిచేస్తున్నవిద్యా వాలంటీర్ పోస్టలు – 185

జాతీయ టెక్స్ట్ పుస్తకాలు (పాఠ్య పుస్తకాలు) :

  1. 2018-19 సం.నికి గాను జిల్లాకు అవసరమైన పాఠ్య పుస్తకల వివరాలను కమిషనర్ & డైరెక్టర్
    స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారికి పంపించడం జరిగింది.
  2. 2018-19 సం.నికి గాను జిల్లాకు అవసరమైన పాఠ్యపుస్తకలు 933024
  3. 2017-18 సం.లో జిల్లాకు అందిన పాఠ్య పుస్తకలు 8,19,671 ఇందులో పంపిణి చేయబడినవి 7,94,483 మిగిలినవి

    25,188.

సర్వ శిక్ష అభియాన్ (ఎస్.ఎస్.ఏ)

ఏకరూప దుస్తులు (ఒకేరకంగా)

  1. ప్రతి విద్యార్థికి 2017-18 సం. నికి గాను రెండు జతల యూనిఫామ్స్ ను పంపిణీ చేయటం జరిగినది.
  2. యూనిఫామ్స్ కు సంభంధించిన బట్టను మండల విద్యావనరుల కేంద్రం (యం.ఆర్.సి) నుండి పాఠశాలలకు ఎస్‌ఎం‌సి ద్వారా పంపిణీ చేయబడ్డాయి.

    ప్రతి విద్యార్థికి రెండు జతల చొప్పున 93360 యూనిఫామ్స్ ను పిల్లలకు కుట్టి ఇవ్వటం జరిగినది.

  3. 2017-18 సం. నికి గాను మొత్తం 96,75,500/- రూ. ల నిధులను 1227 పాఠశాలకు విడుదల చేయటం జరిగింది.

సమ్మిళిత విద్య (సంఘటిత విద్య) కార్యక్రమము అమలు :-

  1. నెలలో ప్రతి మండలలో 4 ఫిజియో తెరోపి క్యాంపులను నిర్వహించడం
  2. డివిజినల్ స్థాయి శిబిరాలు ఎ.ఎల్.ఐ.యం.సి.ఓ సహాయంతో నిర్వహించడం ఈ శిబిరంలో ఉపకరణాలు అవసరమైన విద్యార్థుల జాబితాను సిద్దం చేసి సరఫరా చేయడం.
  3. 218 మంది విద్యార్థులకు సహాయకులుగా వచ్చేవారికి నెలకు రూ. 250/- చొప్పున 10 నెలలకు భత్యం (భత్యం) ఇవ్వడం
    జరిగినది.
  4. 255 మంది విద్యార్థులకు నెలకు 250 రూ. చొప్పున రవాణాభత్యం 10 నెలలు ఇవ్వడం జరిగినది.
  5. 147 మంది సి.డబ్ల్యూ.యస్.ఎన్ పిల్లలు గృహ ఆధారిత విద్యా (గృహ ఆధారిత విద్య) ద్వారా లబ్ది పొందుచున్నారు.
  6. 37 మంది ఐ.ఇ.ఆర్.పి’యస్ సమ్మిళిత విద్యను అందిచించడానికి నియమించబడ్డారు
  7. 360 మంది విద్యార్థులు భవిత సెంటర్ల లలో నమోదు చేయబడి పాఠశాల సంసిద్దతను అందుకుంటున్నారు.
  8. 19 భవితా సెంటర్ లలో 7 భవితా సెంటర్లకు స్వంత భవనాలు ఉన్నాయి అవి ఆర్మూర్, నందిపేట్, నిజామాబాద్, మోర్తాడ్, బోధన్, సిరికొండ మరియు ఎడపల్లి.

కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాలు (కే.జి.బీ.వీ’యస్ )

పరిచయం: –

కే.జి.బీ.వీ అంటే ?:-

ప్రధానంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న యస్.సి , యస్.టీ, ఓబీసి , మైనారిటీ ప్రాంతాల్లోని బాలికలకు ప్రాథమిక స్థాయిలో వసతి గృహ సదుపాయలతో 36 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయవలసి వుండటం వలన భారత ప్రభుత్వం కస్తూర్భ గాంధీ బాలికా విద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిoది. ఈ పథకం ప్రాథమిక విద్యా మరియు అక్షరాస్యత విభాగం యొక్క ప్రస్తుత పథకాలతో సమన్వయం చేయబడుతుంది. అవి సర్వ శిక్ష అభియాన్ (యస్.యస్.ఎ ) యెన్.పి.ఇ.జి.ఇ.ఎల్ మరియు మహిళా సమాఖ్య (యం.యస్ )

లక్ష్యాలు:-

ప్రాథమిక స్థాయిలో హాస్టల్ వసతిని కల్పిస్తూ సమాజంలోని వెనుకబడిన తరగతులకు ప్రవేశం కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్య లక్ష్యం.

పథకం యొక్క పరిధి (పరిధిని) మరియు పరిమితి (కవరేజ్):-

  1. 2011 జనాభా లెక్కల ప్రకారం విద్యాపరంగ వెనుకబడిన బ్లాకులను గుర్తించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అంటే మహిళా
    అక్షరాస్యతా రేటు 46.58% తక్కువగా వుండి లింగబేధం 21.7% కంటే ఎక్కువగా ఉన్నవి.
  2. మన రాష్ట్రం ప్రభుత్వం 36 KGBV రెసిడెన్షియల్ పాఠశాలలను నిజామాబాద్ జిల్లాకు మంజూరు చేసింది.

రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమాలు:-

  1. నూతన భవనాలు నిర్మించడం
  2. ఉపాద్యాయులకు మరియు ఇతర సిబ్బందికి శిక్షణ ఇవ్వడం
  3. సామాజిక కార్యక్రమాలలో విధ్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం అయ్యేలా ప్రోత్సహించడం.
  4. (3861) విద్యార్థులు (25)కే.జి.బీ.వీ లలో చదువుతున్నారు.
  5. జిల్లాలో ముప్కల్, మగ్పాల్, ఎరగట్ల, ఇందల్వఈ, రుద్రుర్ మరియు మెండోరా (425) విద్యార్ధులలో 2017-18 (06) నూతన కే.జి.బీ.వీ’యస్ (ఇ/యం ) విద్యా సంవత్సరంలో ప్రారంభించబడింది.

మరిన్ని వివరాలు కోసం[పి డి ఎఫ్,1.62 ఎంబి]