ముగించు

వయోజన విద్యా శాఖ

వయోజన విద్యా శాఖను తేదీ 02.10.1978న ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున ఈ శాఖ లక్ష్యం 15 సంవత్సరాలకు పై బడిన వయస్సు గల వయోజన గ్రూపుల్లో నిరక్షరాస్యతను నిర్మూలించే కార్యక్రమాన్ని గురించి ప్రణాలికను రూపొందించుకొని దానిని అమలు పర్చడం. క్రియాశీలక పద్దతిలో అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో 1988 లో జాతీయ అక్షరాస్యత మిషన్ స్థాపించబడింది మరియు జిల్లాలో అమలు చేయబడింది. నిరంతర విద్యా కార్యక్రమం ద్వారా లక్ష్యంగా నిర్ణయించిన గ్రూపుల వారికి ఇతర వర్గాల వారికి జీవితకాలంలో  విద్యను అభ్యాసించే వాతావరణాన్ని, వయోజనులలో నైపుణ్యత విద్యను నేర్చుకొని దానిని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి విద్య కొనసాగింపు కార్యక్రమాన్ని అమలు పర్చడం.

జిల్లాల పునర్వ్యస్థీకరణలో ఈ శాఖను విభజించలేదు. జిల్లా స్థాయిలో (పూర్వ జిల్లా అంటే నిజామాబాదు మరియు కామారెడ్డి జిల్లాలు) ఉప సంచాలకులు విధులు నిర్వహిస్తారు. ఆయనకు ప్రాజెక్టు అధికారి, సహాయ ప్రాజెక్టు అధికారులు మరియు సూపర్వైజర్లు సహాయ పడతారు. ఒక ఉప సంచాలకులు మాత్రమే జిల్లా లోక్ శిక్షా సమితి కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

సాక్షర భారత్ కార్యక్రమం అమలు:

2001 జనాభా లెక్కల ప్రకారం 50% మరియు అంతకంటే తక్కువ వయోజన మహిళా అక్షరాస్యత కలిగిన 29 మండలాల గ్రామీణ ప్రాంతాల్లో సాక్షర్ భారత్ కార్యక్రమం 2010 నుండి అమలు చేయబడింది. ఈ పథకం 31.03.2018 వరకు పొడిగించబడింది.  సాక్షర్ భారత్ కార్యక్రమం కింద, ఆగస్టు, 2010 నుండి మార్చి, 2018 మధ్యకాలంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నిర్వహించిన ద్వైవార్షిక ప్రాథమిక అక్షరాస్యత పరీక్ష పరీక్షలో దాదాపు 3.33 లక్షల మంది అభ్యాసకులు హాజరయ్యారు, ఇందులో దాదాపు 1.97 లక్షల మంది అభ్యాసకులు అసెస్‌మెంట్ టెస్ట్‌లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించి అక్షరాస్యులుగా ధృవీకరించ బడ్డారు.

ఇంకా 15 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల దాదాపు 1.50 లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయవలసి ఉంది. కార్యక్రమాన్ని అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది. కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడంపై భారత ప్రభుత్వం నుండి ఉత్తర్వు కోసం వేచి ఉన్నాము.

ప్రస్తుత అక్షరాస్యత స్థితి (2011 జనాభా లెక్కల ప్రకారం) :

క్ర.సం. అక్షరాస్యత శాతం నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం భారతదేశం
1. పురుషులు 74.08 75.04 80.90
2. స్త్రీలు 54.95 57.99 64.60
3. మొత్తం 64.25 66.54 73.00
4. గ్రామీణ ప్రాంతం 58.92 57.00 67.77
5. పట్టణ ప్రాంతం 77.10 81.00 84.11

సాక్షర్ భారత్ కార్యక్రమం షెడ్యూల్ 31.03.2017 వరకు ఉంది. ఇది 31.03.2018 వరకు పొడిగించబడింది. భారత ప్రభుత్వం ప్రస్తుతమున్న సాక్షర భారత్ కార్యక్రమాన్ని మార్పు చేయాలని సంకల్పించి మరియు “పద్నా లిఖ్నా అభియాన్” కార్యక్రమాన్ని ప్రతిపాదించింది. కొత్త పథకం మార్గదర్శకాలు ఇప్పటివరకు జారీ చేయబడలేదు.
అక్షరాస్యత కార్యక్రమాన్ని భారీ స్థాయిలో అమలు చేయడానికి డిపార్ట్‌మెంట్ వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. భారత ప్రభుత్వం మార్గదర్శకాలను అనుగుణంగా, కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాము.

శాఖ సంప్రదింపు వివరాలు
క్ర.సం. అధికారి పేరు హోదా అధికారిక టెలిఫోన్ సంఖ్య ఇ-మెయిల్ ఐడి
1. ఎ. బాపు రావు డిప్యూటీ డైరెక్టర్ (FAC) 08462-295324 (O)9849909218 (M) ddaenizamabad @gmail.com