ముగించు

జిల్లా మత్స్య శాఖ

మత్స్య శాఖ ద్వారా మత్స్యకారులు మరియు మత్య్స కృషివలల ద్వారా చేపల ఉత్పత్తిని పెంచి మరియు దేశ స్థూల జాతీయోత్పత్తి పెంచి దేశ ఆర్ధిక అభివృద్ధిని ;పెంపొందించాలానే ఉద్దేశ్యముతో 18 సంవత్సరాలు నిండిన పురుషులు మరియు మహిళల మత్స్యకారులకు మత్స్యశాఖ ద్వారా సభ్యత్వము ఇవ్వబడును. దీనిలో భాగంగా నిజామాబాదు జిల్లాలో 315 మత్స్య ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘములలో 21052 మంది సభ్యులు కలరు, ఇందులో 249 మత్స్య పారిశ్రామిక సహకార సంఘములలో 18579 సభ్యులు మరియు 65 మహిళా మత్స్య పారిసరామిక సహకార సంఘములలో 2473 మంది సభ్యులు కలరు.

జనాభా భౌగోళిక వివరములు:

మత్స్య సహకార సంఘాలలో నమోదు చేసుకున్న మత్స్య కారులు మరియు వారి వివరములు.
క్రమ సం మానవ వనరులు
మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు సంఖ్య కుటుంబాలు వాటా ధనము
1 ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు 249 18429 1013595
2 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు 65 2473 136015
3 మార్కెటింగ్ సొసైటీ 1 150 8250
మొత్తం 315 21052 1157860
సమగ్రకుటుంబ సర్వే ప్రకారం మత్స్య కారుల జనాభా వివరములు
క్రమ సం మొత్తం మత్స్య కారుల కుటుంబాలు (సమగ్రకుటుంబ సర్వే ప్రకారం) జనాభా
1 గంగపుత్ర 6,313
2 గుండ్ల 30,213
3 ముదిరాజ్ 59,581
4 ముతిరసి 764
5 బోయ 4,458
6 బేస్త 5,223
7 తెనుగోళ్లు 19,721
మొత్తం 126,273

మత్య్సశాఖ ద్వారా నిర్వహించుచున్న కార్యక్రమాములు
చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం పోచంపాడ్:

చేప పిల్ల ఉత్పత్తి కేంద్రం పోచంపాడ్ నందు ప్రతి సంవత్సరం స్థానికంగా ఉన్న తల్లి చేపలను తీసుకొని నాణ్యమైన చేప పిల్లలను ఉత్పత్తిచేయాలనే ఉద్దేశ్యముతో స్థాపించ బడినది.

దీనిలో భాగంగ 2014-15 సంవత్సరము నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము చేప పిల్లలను ఉత్పత్తి చేసి ఉచితంగా మత్స్యకారులకు పంపిణి చేయడం జరిగింది.
Sl No Year Total Fish Seed Seed Qty in Lakhs
1 2014-15 40.00
2 2015-16 42.00
3 2016-17 40.00
4 2017-18 17.69
5 2018-19 26.84
6 2019-20 75 ఇది రాష్ట్రములోనే ప్రథమ స్థానము
7 2020-21 65.57 ఇది రాష్ట్రములోనే ప్రథమ స్థానము

చెరువు కౌలు :

 • నిజామాబాద్ జిల్లాలో 343 చేరువులు ( 100 ఎకరాలు పైబడి) మత్స్యశాఖ ఏదనములో కలవు. ఈ చెరువులకు సంబంధిత మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల నుండి చెరువు కౌలు రకం తీసుకొని ఆ చెరువులపై చేపలు పట్టుకొనే అజ్ఞాపత్రము ఇవ్వడం జరుగుతుంది మరియు ప్రతి సంవత్సరము రూ, 16. 41 లక్షలు లీజూ రూపేణా ప్రభుత్వ ఖజానాకు జమ చేయడం జరుగుతుంది.
 • జీ వో ఆర్ . టి . నెం . 102, తేది 06-10-2020 అనుసరించి 10 శాతము పెంచడము జరిగింది, ఇది అయిదు సంవత్సరముల వరకు అనగా (2019-20 నుండి 2023-24 ) వరకు వర్తించును.
 • జీ వో ఆర్ . టి . నెం . 268, తేది 23-07-2021 ప్రకారం 100 ఎకరాలలోపు ఆయకట్టు గల మైనర్ ఇర్రిగేషన్ చెరువులు కూడా లీజు వర్తించును. ఇది మత్స్య శాఖ పరిధిలోకి మార్చబడినది.

లైసెన్సులు:

 • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నందు నది పరివాహక ప్రాంతములో ఉండే మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనేసదుద్దేశ్యముతో మత్స్య శాఖ చేపలు పట్టుకొనుటకు లైసెన్సులు జారీచేయడం జరుగుతుంది

నూతన మహిళా / మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటు :

 • నూతన మహిళా / మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో 18 సంవత్సరాలు పైబడిన మత్స్యకారులు తమ యొక్క పేర్లను సంఘములో నమోదు చేసూకోని, ప్రభుత్వము ద్వారా వచ్చే పథకములకు లబ్దిపొంది ఆర్థికనగా ఎదగడానికి ఎంతగానో తోడ్పడుతుంది.

మహిళా / మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించుట:

 • జిల్లాలోఉన్న మహిళా / మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రతి అయిదు సంవత్సరాలకు ఒక సారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా నూతన పాలక వర్గమును ఆ సంఘ సభ్యులచే ఎన్నుకోవడం జరుగుతుంది. సంగం యొక్క లావా దేవీలను మరియు సంగం యొక్క కార్యకలాపాలు నిర్వహించుటకు గాను 9 మంది సభ్యుల తో కూడిన పాలక వర్గమమును సంఘ సభ్యులు మరియు రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వారా నియమించడం జరుగుతుంది.

సంఘ భవనములు (కమ్యూనిటీ హాల్ ) నిర్మాణము:

 • వివిఐద మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో సంఘ సమావేశములు నిర్వహించుటకు గాను 50 మంది పైబడి ఉన్న సభ్యులు కల్గిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రభుత్వము ద్వారా సాంగ భవనములు నిర్మించడం జరుగుతుంది.

చేపల మార్కెట్ (ఫిష్ మార్కెట్) నిర్మాణాము:

 • మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు వారి చేపల వ్యాపారం సక్రమంగా కొనసాగించుటకు గాను ప్రభుత్వము చేపల మార్కెట్ నిర్మాణము చేపట్టినది. దీని వలన మత్స్యకారులు తాము చెరువులలో పట్టిన చేపలను ఆరోగ్యకర వాతావరణములో అమ్మి వినియోగదారులకు పరిశుభ్రమైన చేపలను అందించడం జరుగుతుంది.

మత్స్య శాఖద్వారా అమలగుచున్న పథకములు:

 • సమీకృత మత్స్య అభివృద్ధి పథకం
 • మత్స్య అభివృద్ధి పథకం
 • ఆర్.కె.వి.వై. (70 శాతము సబ్సిడీ)
 • సామూహిక ప్రమాద భీమా పథకం రాష్ట్రం ద్వారా 4. 00 లక్షలు , కేంద్రం ద్వారా 2. 00 లక్షలు .
 • నీలి విప్లవం రాష్ట్రం ద్వారా 40 శాతం కేంద్రం ద్వారా 60 శాతము .
 • ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం రాష్ట్రం ద్వారా 40 శాతము కేంద్రం ద్వారా 60 శాతము .
 • పి .యం .కిసాన్ క్రెడిట్ కార్డు.
 • సంచార మత్స్య విక్రయ వాహనాలు (లబ్దిదారుణీ వాట 40 శాతము, సబ్సిడీ 60 శాతము ).

సమీకృత మత్స్య అభివృద్ధి పథకం :

 • తెలంగాణ ప్రభుత్వమూ చేపట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా మత్స్య శాఖ ద్వారా సమీకృత మత్స్య అభివృద్ధి పథకంను అమలు చేయడం జరిగింది. దీనివలన మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యముతో ఈ పథకంను అమలు చేయడం జరిగింది.

చేప పిల్ల విడుదల కార్యక్రమము :

 • ప్రభుత్వమూ 100 శాతము రాయితీతో మత్స్యకారులకు ఉచితంగా నాణ్యమైన చేపపిల్లలను పంపిణి చేసి మత్స్యకారులు ఆర్ధికంగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతుంది.
క్ర సం సంవత్సరము సరఫరా చేసిన చేప పిల్లల సంఖ్య (లక్షలలో ) అయినా ఖర్చు (లక్షలలో )
1 2016-17 265.54 239.16
2 217-18 267.11 251.72
3 2018-19 418.83 399.10
4 2019-20 444.06 369.80
5 2020-21 424.90 327.67

రొయ్యపిల్లల విడుదల కార్యక్రమము :

ప్రభుత్వము 100%రాయితీతో మత్స్యకారులకు ఉచితంగా నాణ్యమైన రొయ్య పిల్లల పంపిణీ చేసి మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతుంది.

క్ర సం సంవత్సరము సరఫరా చేసిన రొయ్య పిల్లల సంఖ్య ( లక్షలలో) అయిన ఖర్చు ( లక్షలలో )
1 2018-19 62.61 122.73
2 2019-20 33.63 62.89
3 2020-21 51.22 106.53

సమీకృత మత్స్య అభివృద్ది పథకము 2017 వివిద ఉపకరణముల పంపిణీ:

 • సమీకృత మత్స్య అబివృద్ది పథకములో భాగంగా అర్హులైన మత్స్యకారులకు 75%సబ్సిడితో వివిద ఉపకరణములు పంపిణీ చేయడం జరిగింది .ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 31 పథకాలకు మత్స్యకారులు ధరఖాస్తు చేసుకొనుటకు 2018-19 సం||నకు గాను అవకాశం కల్పించనైనది . వివిద పథకాలకు గాను
 1. ద్వి చక్రవాహనాలు (2945).
 2. లగెజి ఆటోలు (148).
 3. మొబైల్ ఫిష్ ఔట్ లెట్ (34).
 4. హైజనిక్ వాహనాలు (3).
 5. వలలు(895).
 6. క్రెట్లు (251).
 7. లాగుడు వలలు (2) లబ్దిదారులు లబ్దిపొందడం జరిగింది.

మత్స్య అభివృద్ది పథకము ( కమ్యూనిటీ హళ్ళనిర్మాణము ):

 • మత్స్యకారులకు 90% సబ్సిడితో వివిద సంఘాలకు సంఘ భవనములను ప్రభుత్వం ద్వారా నిర్మించడం జరుగుతుంది.

ఆర్.కె.వి.వై ( చేపల మార్కెట్ నిర్మాణము ):

 • మత్స్యకారులకు 70% సబ్సిడితో వివిద సంఘాలకు సంఘ చేపల మార్కెట్ ను ప్రభుత్వం ద్వారా నిర్మించడం జరుగుతుంది.

సామూహిక ప్రమాద భీమా పథకం :

 • ఫిష్. కో పే డ్ న్యూడిల్లీ ద్వారా రూ , 2. 00 లక్షల భీమా డబ్బులు మరియు రూ, 4. 00 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎక్స్ గ్రేసియా చెల్లించబడును.

కిషన్ క్రెడిట్ కార్డు :

 • మత్స్యకారులు మరియు చేపలు పెంపకంపై ఆసక్తి కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి కిషన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా మత్స్య పరిశ్రమ లో వారికి చేపల వ్యాపారము మరియు వలల కొనుగోలునకు సంబందించి ఋణ సదుపాయం కల్పించడం జరుగుతుంది.

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం:

 • మత్స్యకారులు నూతన సాంకేతిక పరిజ్ఞానమును ఉపయోగించుకొని చేపల ఉత్పత్తిని పెంచి ఆర్థికంగా ఎదగాలనే దృఢ సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య ఉద్దేశ్యం.
క్ర. సం. పథకము పేరు యూనిట్ విలువ(రూ.లక్షలలో ) లబ్ధిదారుని వాటా (రూ.లక్షలలో )
జనరల్/ ఒ.బి.సి.(60%) ఎస్.సి/ఎస్..టి/
మహిళలు (40%)
1 మంచి నీటి చేపల హచరీలు 25.00 15.00 10.00
2 చేపల పెంపకానికి పాండ్స్ నిర్మాణం 7.00 4.20 2.80
3 రిసర్కులేటరు ఆక్వాకల్చర్ సిస్టమ్ 25.00 15.00 10.00
4 జలాశయములలో పంజరములో చేపల పెంపకం 3.00 1.80 1.20
5 ఇన్సులేటెడ్ వాహనాల సరఫరా 20.00 12.00 8.00
6 మూడు చక్రముల వాహనముల సరఫరా 3.00 1.80 1.20
7 చిన్న తరహా చేప దాణా మిల్లుల ఏర్పాటు 30.00 18.00 12.00
8 మత్స్య విక్రయ కేంద్రముల ఏర్పాటు 10.00 6.00 4.00
9 పొదుపు- సహాయక పథకము మత్స్య 0.45 0.27 0.18

సమీకృత మత్స్య అభివృద్ది పథకము:

 • మహిళ మత్స్యకారిణిలు ఆర్థికంగా ఎదగలనే ఉద్దేశ్యముతో 100% సబ్సిడీ ప్రభుత్వ మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు రేవాల్వింగ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయము చేయుచున్నది .

సంచార మత్స్య విక్రయ వాహనాలు :

 • సంచార మత్స్యవిక్రయ వాహనాలు (మొబైల్ ఫిష్ రిటైల్ ఔట్ లేట్ ) 2020-21 సం|| నకు గాను జాతీయ మత్స్య అబివృద్ది సంస్థ యన్.యఫ్ .డి.బి )హైదరబాద్ గారి ఆర్థిక సహాయముతో మత్స్య శాఖ ద్వారా నిరుద్యోగ మహిళా కు ఉపాది కల్పన మరియు పరిశుబ్రమైన చేపలను వినియోగదారులకు అండిచాలనే సదుద్దేశముతో ఈ పథకమును రూపకల్పన చేయడం జరిగింది .దీనిలో భాగంగా జిల్లాలో 03 లబ్దిదారులకు మత్స్య విక్రయ వాహనములు మంజూరు చేయడం జరిగింది,దీనికి గాను ప్రభుత్వం 60%సబ్సిడీ తో రూ ,18.00 లక్షల విడుదల చేయడం జరిగింది .
మత్స్యశాఖ అధికారుల వివరములు
క్ర . సం అధికారి పేరు హోదా మొబైల్ నెం ఈమెయీల్ ఐడి
1 శ్రీ డి.ఆంజనేయస్వామి జిల్లా మత్స్యశాఖ అధికారి 9949968466 dfonzbad@gmail.com
2 శ్రీ లాయక్ మోహినోద్దీన్ మత్స్య అభివృద్ది అధికారి 9701661657 dfonzbad@gmail.com

ప్రగతి నివేదికలు 2020-21:

లీజులు & లైసన్స్ :

 • నిజామాబాద్ జిల్లాలో 343చెరువులు మత్స్యశాఖ అదినములో కలవు ,వాటి విస్తీర్ణము 14742.59 హెక్టోర్లు కలదు .343 డిపార్ట్మెంట్ చెరువులు గాను ఇప్పటి వరకు 324 చెరువులకు వివిద మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల నుండి రూ,15,48,632 లు మత్స్యశాఖ తీసుకొని ప్రభుత్వ ఖాతాలో జమచేయడం జరిగింది .
 • నిజామాబాద్ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మరియు నది పరీవాహక ప్రాంతాల మత్స్యకారులకు 1600 లైసన్స్ ల నిర్దేశ్యమునకు గాను 1666 లైసన్స్ జారీచేయడం జరిగింది దానికి గాను రూ,4,88,731/-ప్రభుత్వ ఖాతాలో జమచేయడం జరిగింది .104% తో రాష్ట్రంలోనే ప్రథమ స్థానములో ఉన్నది .

చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం పోచంపాడ్ :

 • 2021-22 సం||నకు గాను 10.00 కోట్ల చిరు చేపల (స్పాన్ ),2.50 కోట్ల 34-40 యం,యం,సైజు చేపపిల్లలను ఉత్పత్తి భాగంగా ఇప్పటి వరకు 3.70 కోట్ల చిరు చేపలు( స్పాన్ ) ఉత్పత్తి చేయడం జరిగింది .

100%సబ్సిడితో చేప పిల్లల విడుదల కార్యక్రమము :

 • 2020-21 సం|| నకు గాను జిల్లాలో ( 879 చెరువులు +1 రిసర్వాయర్ =880)చెరువులలో 4.24 కోట్ల చేప పిల్లలను వదలడం జరిగింది దానికి గాను అయిన ఖర్చు రూ,3.27 కోట్లు వెచ్చించడం జరిగింది .

100% సబ్సిడితో రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమము :

 • 2020-21 సంవత్సరమునకు 51.22 లక్షల రొయ్య పిల్లల రిసర్వాయర్ నందు మరియు వివిద చెరువులలో వదలడం జరిగింది,దానికి 2020-21సంవత్సరమునకు గాను రూ,106.53 లక్షలు వెచ్చించడం జరిగింది.

సామూహిక ప్రమాద భీమా పథకము :

 • 2020-21 సం || నకు గాను 8 మందికి 2.00 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుండి మొత్తం 08 మందికి 16.00 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది .

పి.యం కిషన్ క్రెడిట్ కార్డు :

 • జిలాలో 5000 ధరకాస్తుల నిర్దేశ్యమునకు గాను 4710 మంది మసత్యకారులు కిషన్ క్రెడిట్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇట్టి దరకాస్తులను సంబంధిత బ్యాంకు కాతాలో రూ , 3.29 కోట్లు జమా చేయడం జరిగింది. ( ఇది రాష్ట్రములోనే మొదటి స్థానముగా ఉన్నది) మిగతా వారికి త్వరాలోనే మంజూరు చేస్తారని బ్యాంకు అధికారులు తెలపడం జరిగింది.

సమీకృత మత్స్య అభివృద్ది పథకము:

 • 2020-21 సంవత్సరమునకు గాను రివాల్వింగ్ ఫండ్ ద్వారా 4 మహిళా సంఘాలకు ఒక్కో సంఘానికి రూ , 3.00 లక్ష్యల చొప్పున మొత్తం రూ , 12. 00 లక్ష్యలు ఇవ్వడం జరిగింది.

సంచార మత్స్య విక్రయ వాహనాలు 2020-21:

 • సంచార మత్స్య విక్రయ వాహనాలు (మొబైల్ రిటైల్ ఫిష్ అవుట్ లేట్ ) 2020-21 సంవత్సరమునకు గాను జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ హైదరాబాద్ గారి (60 శాతము) ఆర్ధిక సహాయముతో మత్స్య శాఖ (40 శాతము) ఆర్ధిక సహాయముతో నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పనా మరియు పరిశుభ్రమైన చేపలను వినియోగదారులకు అందిచాలానే సదుద్దేశ్యముతో ఈ పథకమును రూపకాలనా చేయడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లాలో 03 లబ్దిదారులకు మత్స్య విక్రయ వాహనములు మంజూరు చేయడం జరిగింది, దీనికి గాను ప్రభుత్వం 60 శాతము సబ్సిడీతో రూ , 18. 00 లక్షలు విడుదల చేయడం జరిగింది.

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం :

 • ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం 2020-21 సంవత్సరమునకు గాను 34 ధరకాస్తులు స్వీకరించడం జరిగింది. మొదటి విడతగా 15 మంది క్రొత్త చెరువుల త్రవ్వకానికి సంబందించి మరియు 1ఆర్ .ఎ. యస్. కు సంబందించి మొత్తం 16 మంది లబ్ధిదారులు ఎంపిక కావడం జరిగింది. అట్టి దారకాస్తులను గౌరవ కమీషనర్ మత్స్యశాఖ తెలగంగా రాష్త్రం హైరదరాబాద్ గారికి పంపడం జరిగింది.

కమ్యూనిటీ హల్లు :

 • 2018-19 సంవత్సరామునకు గాను మత్స్య పారిశ్రామిక సహకార సంఘము ధర్మోర ( మోర్తాడ్ మండలం ) వెంకటాపూర్ (వేల్పూర్ మండలం ) లకు ప్రభుత్వం నుండి రూ , 18. 00 లక్షలు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణము కొరకు మంజూరి చేయడం జరిగింది.

ఫిష్ మార్కెట్ :

 • మిగతా రెండు మత్య్స పారిశ్రామిక సహకార సంఘాలు బాల్కొండ ( బాల్కొండ మండలం ) చేపల మార్కెట్ నిర్మాణములో ఉన్నది. పోచంపాడ్ (మెండోరా మండలం) లకు ప్రభుత్వమూ నుండి రూ , 20. 00 లక్షలు ఫిష్ మార్కెట్ నిర్మాణము కొరకు మంజూరు చేయడం జరిగింది.