ముగించు

జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసు

జిల్లా కార్యాలయం యొక్క విధులు, నిర్వహణలు :

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నిజామాబాదు జిల్లా కార్యాలయ నిర్వహణ కమీషనర్ ఇంటర్మీడియట్ విద్య, హైదరాబాదు, తెలంగాణా, పరిధిలో ఉంటుంది. తెలంగాణా రాష్ట్రం లో జిల్లాల వికేంద్రీకరణలో భాగంగా అధికారులను మరియు హోదాను మార్చటం జరిగినది. జిల్లా వృత్తి విద్యాధికారి మరియు రిజినల్ ఇన్స్పెక్షన్ అధికారి హోదాను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, నిజామాబాదు గా Proc.Rc.No.Ser.I-1/203/2016, Dated:6-9-2019 ఆర్డర్ ని పరిగణలోకి 11-10-2016 vide G.O.Rt.No.333, dated:11-10-2016 ప్రకారం కమీషనర్, ఇంటర్మీడియట్ విద్య, హైదరాబాద్, తెలంగాణా Rc.No.Serv-I-1/NEW DISTRICTS/2016-8, dated:11.10.2016 కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాకు గాను ప్రభుత్వ కళాశాలల విధులు మరియు భాధ్యతలు నోడల్ ఆఫీసర్ ని నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వటం జరిగినది.
శాఖ యొక్క విధులు మరియు కార్యకలాపాలు ఈ క్రింద పేర్కొనటం జరిగినది.

 1. పరిపాలన విధులు :-
  1. ప్రభత్వ, ప్రభుత్వ రంగ, మరియు ప్రభుత్వేతర కళాశాలలను బలోపేతం చేయటుకు వాటి యొక్క దిశా నిర్దేశాలు ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలు పాటిస్తూ పర్యవేక్షించటం. మరియు ప్రభుత్వ కళాశాలలోని సిబ్బంది (ప్రిన్సిపాల్, అధ్యాపకులు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ మరియు బోదేనేతర సిబ్బంది) వారి యొక్క సర్వీస్ మేటర్స్ పర్యవేక్షించటం. ప్రభుత్వేతర కళాశాలలను నిరంతరంగా పర్యవేక్షణ మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరిక్షలు మార్చ్ నెలలో మరియు అడ్వాన్సడ్ సప్లిమెంటరి పరిక్షలు మే/జూన్ నెలలో, సంవత్సరంలో రెండు సార్లు నిర్వహించటం జరుగుతుంది.
  2. ప్రభత్వ, ప్రభుత్వ రంగ, మరియు ప్రభుత్వేతర కళాశాలలలో ప్రవేశాలు వాటి యొక్క రికార్డ్ ల తనికి చేయటం, విధ్యాసంవత్సరానికి సంబంధించిన ఇతర విషయాలు, మరియు విచారణాలు చేయటం జరుగును.
  3. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి వాటి యొక్క భవనాలు, ప్రహరి గోడ, మరియు మరుగు దొడ్ల నిర్మాణాలకు నాబార్డ్ నిధులు ద్వారా RIDIF-XVIII, XIX, XX, XXI వినియోగం మరియు పర్యవేక్షించటం. ఓప్పంద అధ్యాపకుల యొక్క గౌరవ వేతనం మరియు ప్రభత్వ మరియు ఎయిడెడ్ కళాశాలలలో మంజూరు అయినటువంటి యస్.సి/యస్.టి/బి.సి/మైనారిటీ యొక్క ఉపకారవేతనాలు పర్యవేక్షించటం.
  4. ఇంటర్మీడియట్ పరిక్షల ఫలితాలకు సంబంధించి జిల్లాలోని ప్రభత్వ, ప్రభుత్వ రంగ, మరియు ప్రభుత్వేతర కళాశాలల పనితీరును పర్యవేక్షించటం.
  5. నిజామాబాదు జిల్లాలో 15 ప్రభుత్వ కళాశాలలు, 02 ఎయిడెడ్ కళాశాలలు, 47 ప్రభుత్వేతర కళాశాలలు, 05 తెలంగాణా రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు, 03 తెలంగాణా రాష్ట్ర సాధారణ గురుకుల సొసైటీ కళాశాలలు, 02 తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలు, 17 తెలంగాణా రాష్ట్ర అల్పసంఖ్యాకుల గురుకుల కళాశాలలు, 10 తెలంగాణా రాష్ట్ర ఆదర్శ కళాశాలలు, 06 మహాత్మా జ్యోతిభ పులే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల కళాశాలలు, 08 కస్తురిబా గాంధీ బాలికల కళాశాలలు నడపబడుచున్నవి.
  6. కళాశాలలలోని సిబ్బంది మరియు విద్యార్థుల హాజరును బయోమెట్రిక్ డివైస్ మరియు cc కెమెరా ల ద్వారా పర్యవేక్షించటం.
  7. అన్ని కళాశాలలలో ఉన్నటువంటి వృత్తి విద్య కోర్సులను ఆజమాయిషి చేయటం, ముఖ్యంగా వాటికీ కేటాయించబడిన నిధులను సక్రమంగా వినియోగించటం, కళాశాలలో విద్య ప్రమాణాలు, పరిపాలన ప్రమాణాలను పనిచేసే విధంగా చూడటం. వృతి విద్య కోర్సులకు సంబంధించి అన్ని రికార్డ్ లను పరిశీలించటం. .
  8. జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ఎయిడెడ్ కళాశాలలలో పనిచేస్తున్న సిబ్బంది యొక్క సర్వీస్ మేటర్స్, మరియు ప్రవర్తన పై తగు చర్యలను తీసుకునే విధంగా విచారణ చేయుటకు అధికారం జిల్లా విద్యాధికారి పరిధిలో కలదు.

 2. విద్య విధులు :
  1. జూనియర్ కళాశాలలలో పనిచేస్తున్న సిబ్బంది (బోధనా మరియు బోధనేతర) సంబంధించిన విభాగాలలో శిక్షణ ఇప్పించటం.
  2. వృత్తి విద్య కోర్సులలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు అప్రెంటిస్ షిప్ కొరకు ఎంపిక జరిపి ఉద్యోగ కల్పనకు దోహదం చేయటం.
  3. వార్షిక పరిక్షలు మరియు సప్లిమెంటరి పరిక్షల యొక్క మూల్యాంకనం కొరకు మూల్యాంకన కేంద్రమును ఏర్పాటు చేయటం.
  4. పరీక్షా ఫలితాలను ప్రకటించటం మరియు ఉత్తీర్ణత కాబడిన విద్యార్థులకు ధృవీకరణ ప్రతులను అందజేయటం.
  5. ఉచిత పాఠ్య పుస్తకాలు : ప్రతి సంవత్సరం ఉచిత విద్యలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలలో చదువుతున్నా విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను తెలుగు అకాడెమి హైదరాబాద్ ద్వారా అందజేయటం.
  6. నిజామాబాదు జిల్లలో 15 ప్రభుత్వ కళాశాలలు నడుపబడుచున్నవి, వాటికీ సొంత భవనాలు మరియు మౌలిక వసతులు ఉన్నవి. ఈ విద్య సంవత్సరానికి 2021 – 2022 గాను ప్రభుత్వ కళాశాలలో ఇప్పటివరకు జరిగిన ప్రవేశాలు మొదటి సంవత్సరం : 4305, రెండవ సంవత్సరం: 3864, మొత్తం : 8169.

 3. అకౌంట్లు:
  1. 310-311, 280-284,020 వేతనాలు మరియు కాంటిన్జెంట్ బడ్జెట్ ఎయిడెడ్ కళాశాలలలో పనిచేస్తున్న సిబ్బంది, మరియు ప్రభుత్వ కళాశాలలోని PTJL సిబ్బంది, క్రింది స్థాయి ఉద్యోగులు మరియు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తునటువంటి ఒప్పంద అధ్యాపకుల వేతనాలను మరియు అతిధి అధ్యాపకుల వేతనాలను తయారు చేయటం.

   కావున, ఈ శాఖకు ఎటువంటి ఆర్ధిక లక్ష్యాలు ఫలితాలను సాధించేటటువంటివి నిర్దేశించబడలేదు మరియు ఈ కార్యాలయం (10+2) ఇంటర్మీడియట్ విద్యామండలి పరిధిలోనికి వస్తుంది.

 4. ఫలితాలు :
 5. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 2018-2019 – 57%
  ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం 2018-2019 – 67%
  ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 2019-2020 – 49%
  ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం 2019-2020 – 60%
  ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 2020-2021 – 100%
  ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం 2020-2021 – 100%
క్ర.సం. వర్గం యాజమాన్యం కళాశాలల సంఖ్యా మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం మొత్తం
1 ప్రభుత్వ ప్రభుత్వ కళాశాలలు 15 4205 3864 8069
2 ప్రభుత్వ రంగ ఎయిడెడ్ 2 116 176 292
3 సాంఘిక సంక్షేమ 5 415 411 826
4 సాధారణ సంక్షేమ 3 230 232 462
5 గిరిజన సంక్షేమ 2 40 22 62
6 వెనుకబడిన తరగతుల సంక్షేమ 6 600 130 730
7 అల్పసంఖ్యాకుల సంక్షేమ 17 850 327 1177
8 ఆదర్శ కళాశాలలు 10 1148 1406 2554
9 కస్తూరిబా గాంధి 8 450 505 955
10 ప్రభుత్వేతర ప్రభుత్వేతర 47 10000 11626 21626
మొత్తం 115 18054 18699 36753
ప్రభుత్వ కళాశాలలలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్ట్ లు మంజూరు అయిన పనిచేస్తున్న, మరియు ఖాళీలు ఈ క్రింద పేర్కొనటం జరిగినది:
పోస్ట్ యొక్క పేరు మంజూరు పనిచేయు ఖాళీలు
ప్రిన్సిపాల్ 15 15 0
అధ్యాపకులు 229 34 195
లైబ్రేరియన్ల్ 13 4 9
ఫిజికల్ డైరెక్టర్లు 12 1 11
సూపరింటెండెంట్ 1 1 0
సినియర్ అసిస్టెంట్ 17 7 10
జూనియర్ అసిస్టెంట్ 10 10 0
టైపిస్ట్ 6 3 3
టైపిస్ట్ కం., జూనియర్ అసిస్టెంట్ 5 1 4
రికార్డ్ అసిస్టెంట్ 24 22 2
ఆఫీస్ సబ్ఆర్డినేట్ 43 16 27
నైట్ వాచుమన్ 4 1 3
స్వీపెర్ & స్కావెంజేర్ 3 0 3
పంపు డ్రైవర్ 1 0 1
ఒప్పంద అధ్యాపకులు 0 148 0
అతిధి అధ్యాపకులు 0 73 0
మొత్తం 383 342 268
క్ర.సం. అధికారి పేరు హోదా అధికారిక నెంబర్ ఇమైల్ ఐడి
01 యల్.రఘురాజ్ డి.ఐ.ఇ .ఓ 9848309005 dieo.nizamabad@gmail.com