ముగించు

జిల్లా పరిశ్రమలు మరియు వాణిజ్యం

పరిశ్రమల శాఖ గురించి:

పారిశ్రామిక విధానం 1977 అనుసరించి, జిల్లా పరిశ్రమల కేంద్రములు దేశవ్యాప్తంగా తేదీ.01.05.1978 నుండి కేంద్ర ప్రయోజిత పథకము క్రింద ప్రారంబించబడినవి. దీని ముఖ్య ఉద్దేశం చిరు, చిన్న తరహ మరియు కుటిర పరిశ్రమలను చిన్న పట్టణాలలో, దేశవ్యాప్తంగా నెలకొల్పుటకు ప్రోత్సాహించడం, పరిశ్రమలను స్థాపించటానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తగు సలహాలు, వాటికి కావలసిన వివిధ రకాల అనుమతులు, లైసెన్సుల వివరములు, సహాయం చేయుటకై జిల్లా కేంద్రంలో తగు వ్యవస్థను ఎర్పాటు చేయనైనది.

శాఖ కార్యాకలపాలు

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు,టీఎస్ ఐ-పాస్ పోర్టల్ (అంతర్జాలం) లో నందు పరిశ్రమలను స్థాపించటానికి కావలసిన వివిధ రకాల అనుమతులు, లైసెన్స్ లు వివిధ శాఖల నుండి ఏకగవాక్ష పద్దతిలో (సింగిల్ విండో) ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనైనది. పరిశ్రమలకు వివిధ రకాల రాయితీలు మంజూరు చేయడం, ప్రధాన మంత్రి ఉఫాధీ కల్పనా పథకము (పి. ఎం. ఈ. జి. పి.) నిరుద్యోగ యువతీ యువకులకు ఉత్పత్తి రంగంలో, మరియు సేవా రంగంలో పరిశ్రమలను స్థాపించటానికి అభ్యర్థులను ఎంపిక చేసి ఆర్థిక సహాయం కొరకు బ్యాంకులకు పంపడం, పరిశ్రమలకు కావలసిన ముడి సరుకులను కేటాయించడం. మూతబడిన పరిశ్రమలను (సిక్ ఇండస్ట్రీస్) తెరవడానికి ప్రోత్సాహించడం, పరిశ్రమలకు మార్కెటింగ్ సహాయం అందించడం.

పథక వివరాలు:

  1. తెలంగాణ రాష్ట పారిశ్రామిక విధాన అనుమతుల స్వియ ధృవీకరణ చట్టo, 2014 (టిఎస్-ఐ పాస్ 2014):

    పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన పలు అనుమతులకు సంబంధించిన అప్లికేషన్ల వేగవంతమైన ప్రాసెసింగ్ కోసం పారిశ్రామికవేత్త అందించిన స్వీయ-సర్టిఫికేట్ ఆధారంగా ఏకగవాక్ష విధానంలో, టి.యస్-ఐ పాస్ ద్వారా వ్యవస్థాపకులకు వీలు కల్పిస్తుంది. వెబ్ సైట్ వివరములు http://ipass.telangana.gov.in.

  2. టి-ఐడియా మరియు టి-ప్రైడ్-యాక్ట్,2014-2019 :

    రాష్ట్రంలో పెట్టుబడి దారులకు ఉత్తమ పెట్టుబదుల కేంద్రంగా తెలంగాణ రాష్టాన్ని ప్రోత్సాహించేందుకు రాష్ట ప్రభుత్వం టి-ఐడియా (టి-ఐ డి ఇ ఏ) తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మరియు పారిశ్రామికవేత్త అభివృద్ది పథకం ను ప్రవేశపెట్టబడినది.

  3. టి- ప్రైడ్ :

    రాష్ట్రంలో షెడ్యుల్డ్ కుల, షెడ్యుల్డ్ తెగ మరియు వికలాంగ వ్యవస్థాపకులు ఏర్పాటు చేసిన అన్ని కొత్త తయారీ రంగ పరిశ్రమలకు రాష్ట ప్రభుత్వం (టి- ప్రైడ్) (దళిత పారిశ్రామికవేత్తల రాపిడ్ ఇంక్యుబేషన్ కోసం తెలంగాణ రాష్ట్రం కార్యక్రమం) ప్రోత్సాహకం పథకం ద్వారా పలు రాయితీలు అందిస్తుంది.

  4. పీఎంఈజీపీ:

    గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సుక్ష్మ, చిన్న తరహ పరిశ్రమలను ఏరాటుచేయడం ద్వారా ఉద్యోగ అవకాశాల కోసం ప్రధాన మంత్రి ఉఫాధీ కల్పనా పథకము (పి.యం.ఈ.జి.పి) అనే నూతన క్రెడిట్ సబ్సిడీ కార్యాక్రమాన్ని భారత ప్రభుత్వం అందిస్తుంది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజేస్ (ఎం.ఎస్.ఎం.ఇ) మంత్రిత్వ శాఖ ద్వారా పి.యం.ఈ.జి.పి (౩) సంస్థలు డి.ఐ.సి, టియస్ కే.వి.ఐ.బి మరియు కే.వి.ఐ.సి సంస్థల ద్వారా అమలు చేయబడుతుది.

పురోగతి నివేదిక 2017-18:

టిఎస్-ఐ పాస్:
2017-18 ఆర్ధిక సంవత్సరానికి, (101) యూనిట్లు, 153.48 కోట్ల పెట్టుబడితో (217) అనుమతుల కోసం దరఖాస్తు చేయబడ్డాయి. దీనిలో (169) అనుమతులు ఆమోదం పొందింది.

రాయితీలు:
2017-18 ఆర్ధిక సంవత్సరానికి (267) యూనిట్లకు, సబ్సిడీ రూ.8,74,82,646/- మంజూరు చేయబడినవి.

పీఎంఈజీపీ 2017-18:
ఈ పథకము క్రింద వివిధ బ్యాంకుల ద్వారా రూ.1,61,10,000/- రాయితీలతో (45) యూనిట్లు మంజూరు చేయబడ్డాయి.


అధికారిక పేర్లు మరియు పరిచయాలు:
వరుస సంఖ్యా అధికారిక పేరు హోదా ఫోన్ / మొబైల్ నంబర్
1 శ్రీ.బబురావ్ జనరల్ మేనేజర్ 9440310432