ముగించు

మార్కెఫెడ్

తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్.

విభాగం గురించి వివరణ :

మార్కెఫెడ్ సంస్థను ఎరువుల కొనుగోలు, నిల్వ చేయడం మరియు సరఫరా చేయడానికి నోడల్ ఏజెన్సీగా నియమించబడింది. వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించేందుకు అవసరమైన వ్యవసాయ ఉత్పాద కారకాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సకాలంలో రైతులకు కనీస ధరకు సరఫరా చేయడం జరుగుతుంది.

విభాగం యొక్క కార్యక్రమాలు:

  1. తెలంగాణ రాష్ట్రానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న మార్కెఫెడ్ ద్వారా ఎరువులు, జింక్ సల్ఫేట్ మరియు జిప్సంను రైతులకు వివిధ పథకాల ద్వారా సబ్సిడీ క్రింద సరఫరా జరుగుతుంది.
  2. రైతుల పంటకు కనీస మద్దతు ధర లభించేలా చూసేందుకు వారి ఉత్పత్తులను అనగా మొక్కజొన్న, జొన్న, పేసర్లు, మినుములు, కందులు, శనగలు(FCI మరియు NAFED) ద్వారా కొనుగోలు చేయడానికి మార్కెఫెడ్ నోడల్ ఏజెన్సీగా ఉన్నది.
  3. వాణిజ్య పంటలు అయినటువంటి పసుపు, మిర్చి పంటలకు కనీస మద్దతు ధర లేదు. ఒక వేళ మార్కెట్ లో వీటి ధర చాల తక్కువగా ఉంటే రైతుల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం(MIS) కింద మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది.
  4. మార్కెఫెడ్ సంస్థ ఎప్పటికప్పుడు అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల ధరలను పర్యవేక్షించడం జరుగుతుంది. ఒక వేళ మార్కెట్ లో ఉన్నటువంటి ధర, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కన్నా తక్కువగా ఉంటే వెంటనే మార్కెఫెడ్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కనీస మద్దతు ధర కన్నా తక్కువగా ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుండి కొనుగోలు చేయడానికి మార్కెఫెడ్ సిద్ధంగా ఉంటుంది.
డిపార్ట్‌మెంట్ యొక్క ముఖ్యమైన పరిచయాలు:
క్రమ సంఖ్య అధికారి పేరు హోదా మొబైల్ నంబర్ ఇమెయిల్ ID
1 వై రంజిత్ కుమార్ రెడ్డి జిల్లా అధికారి 7288879814 nizamabad.markfed@gmail.com

గడిచిన మూడు సంవత్సరాల కొనుగోలు వివరాలు