పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ
పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ గురించి వివరణ
నిజామాబాద్ జిల్లాలోని పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ జిల్లా కార్యాలయము, కోటగల్లి, శివాజీ నగర్ యందు కలదు, ఇట్టి శాఖ అద్వర్యంలో జిల్లా పశువైధ్యశాల (1), ప్రాంతీయ పశువైధ్యశాలలు (4), ప్రాథమిక పశువైధ్య కేంద్రాలు (36), పశు ఆరోగ్య ఉప కేంద్రాలు (41), జిల్లా పశువ్యాదుల నిర్ధారణ కేంద్రము (1) మరియు సంచార పశువైద్య కేంద్రాలు (GVK అధ్వర్యంలో ) (4) మరియు జిల్లా పశుఘనభివృద్ది సంఘం, సారంగాపూర్, నిజామాబాద్ గారి అద్వర్యంలో గోపలమిత కేంద్రాలు (44) వివిధ గ్రామాలలో పనిచేయుచున్నవి.
జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ యొక్క కార్యకలాపాలు :
క్రమ. సం. | పశుసంపద వివరములు. | సంఖ్య. |
---|---|---|
1 | గోజాతి పశువులు | 1,01,252 |
2 | గేదె జాతి పశువులు | 2,06,898 |
3 | గొర్రెలు | 7,35,549 |
4 | మేకలు | 1,56,619 |
మొత్తం | 1,20,00,318 |
క్ర.సం | కాల పరిధి | కార్యక్రమము | లక్ష్యము |
---|---|---|---|
1 | 20 మే నుండి 31 మే 2021 | చిటుక వ్యాధి నిరోధక టీకాలు | జిల్లలో గల అన్ని జీవాలకు టీకాలు వేయుట |
2 | 01 జూన్ నుండి 11 జూన్ 2021 | గొంతువాపు మరియు జబ్బవాపు వ్యాధి నిరోధక టీకాలు. | జిల్లాలోని గోజాతి మరియు గేదె జాతి పశువులకు టీకాలు |
3 | 21 జూన్ నుండి 26 జూన్ 2021 | గొర్రెలు, మేకలలో నట్టల నివారణ మందుల పంపిణి (1 రౌండ్ ) | 100 % గొర్రెలు మరియు మేకలకు . |
4 | 01 జూలై నుండి 10 జూలై 2021 | గోజాతి మరియు గేదె జాతి పశువులలో నట్టల నివారణ కార్యక్రమము (1 రౌండ్) | మొత్తం గోజాతి మరియు గేదేజాతి పశువులకు |
5 | 15 జూలై నుండి 20 ఆగష్టు 2021 | గలికుంటూ వ్యాధి టీకాలు(1రౌండ్) | మొత్తం గోజాతి, గేదేజాతి మరియు గొర్రెలు, మేకలకు . |
6 | 01 సెప్టెంబర్ నుండి 09 సెప్టెంబర్ 2021 | గొర్రెలు,మేకలలో అమ్మతల్లి వ్యాధి నిరోధక టీకాలు. | కొత్తగా జన్మించిన / కొన్న గొర్రెలు /మేకలకు (33 శాతం) |
7 | 20 అక్టోబర్ నుండి 05 నవంబర్ 2021 | పిపిఆర్ వ్యాధి నిరోధక టీకాలు. | 100 % గొర్రెలు మరియు మేకలకు .. |
8 | 09 నవంబర్ నుండి 18 నవంబర్ 2021 | బ్రుసిల్ల వ్యాధి నిరోధక టీకాలు. | 4-8 నెలల వయస్సుగల గోజాతి మరియు గేదేజాతి దూడలకు . |
9 | 01 డిసెంబర్ నుండి 08 డిసెంబర్ 2021 | గొర్రెలు, మేకలలో నట్టల నివారణ మందుల పంపిణి (2 రౌండ్ ) | 100 % గొర్రెలు మరియు మేకలకు . |
10 | 04 జనవరి నుండి 12 జనవరి 2022 | పెరటి కోళ్ళల్లో కొక్కెర, అమ్మతల్లి వ్యాధి నిరోధక టీకాలు మరియు నట్టల నివారణ | మొత్తం పెరటి కోళ్ళకు. |
11 | 01 ఫిబ్రవరి నుండి 10 మార్చ్ 2022 | గలికుంటూ వ్యాధి టీకాలు(2రౌండ్) | మొత్తం గోజాతి, గేదెజాతిగొర్రెలు మరియు మేకలకు. |
పశువైద్య మరియు సంవర్ధక శాఖ ద్వారా నిర్వహించబడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు:
- గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం :
- గొర్రెలు మరియు మేకలలో ఉచిత నట్టల నివారణ పంపిణి కార్యక్రమము:
- జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమము (NAIP)
- మొదటి దశ : ఉచిత కృత్రిమ గర్భధారణ కార్యక్రమము తేదీ 25.09.2019 నుండి 31.05.2020 వరకు జరిగినది.
- రెండవ దశ : ఉచిత కృత్రిమ గర్భధారణ కార్యక్రమము తేదీ 01.08.2020 నుండి 31.07.2021 వరకు జరిగినది.
- మూడవ దశ : ఉచిత కృత్రిమ గర్భధారణ కార్యక్రమము తేదీ 01.08.2021 నుండి 31.05.2022 వరకు జరుపబడును.
- పశువులకు వైద్యం చేయుటకొరకు ఉపయోగించే ఇనుప కట్కారా
- గడ్డి విత్తనాల పంపిణి కార్యక్రమము –
- చొప్ప నరుకు యంత్రములు :
- జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమము ( NADCP)
- గాలికుంటూ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమమును తేది 1 పిబ్రవరి 2020 నుండి 31.07.2020
వరకు గోజాతి మరియు గేదేజాతి పశువులలో ఉచితముగా వేయడము జరిగింది. - బ్రుసిల్ల వ్యాధి నిరోధక టీకాలు. 4-8 నెలల వయస్సుగల గోజాతి మరియు గేదేజాతి దూడలకు తేదీ
17.08.20 21 నుండి 16.09.2021 వరకు వేయబడును.
క్రమ సంఖ్య | సంవత్సరం | గొర్రెల యూనిట్ల పంపిణి (20+1) | రిమార్కులు | |
---|---|---|---|---|
లక్ష్యం | సాధించిన ప్రగతి | |||
1 | 2017-18 | 9631 | 8522 | (8522) గొర్రెల యూనిట్లు పంపిణి 2017———18 నుండి 2018 -19 సంవత్సరం వరకు కొనసాగింది. |
2 | 2018-19 | 9475 | 1134 | (1134) గొర్రెల యూనిట్లు 2018- 19 సంవత్సరం నుండి ఇప్పటివరకు కొనసాగుతోంది. |
గొర్రెల యూనిట్ ధర రూ.1,25,000/- నుండి రూ.1,75,000/- కు పెంచడం జరిగింది. గొర్రెల పంపిణి కొరకు సంబంధించిన మార్గదర్శకాలు జారి కావలసి వుంది.
ప్రస్తుతం (1073) గొర్రెల యూనిట్లకు సంబందించిన లబ్దిదారుల యొక్క వాటా (డి.డి.లు) బ్యాంకులో ఇదివరకు జమచేయబడి వున్నాయి.
జిల్లాలోని 8,61,613 గొర్రెలు మరియు మేకలకు తేదీ 06.08.2021 నుండి 13.08.2021 వరకు ఉచితముగా నట్టల నివారణ మందులని పోయడము జరిగింది. ఇట్టి కార్యక్రమము సంవత్సరములో రెండు సార్లు నిర్వహించడము జరుగును.
జిల్లా కలెక్టర్ గారి సౌజన్యంతో (50) ఇనుప ట్రేవిసి (పశువులకు వైద్యం చేయుటకొరకు ఉపయోగించే ఇనుప కట్కారా) లను వివిధ గ్రామాలలో ఉచితంగా ఏర్పాటు చేయడము జరిగింది.
జిల్లాలోని పశుపోషక రైతులకు 75 శాతం రాయితి పై వివిధ రకాల గడ్డి విత్తనాలను AFDP, CSS మరియు ప్లాన్ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు అందించడము జరుగును.
చొప్పనరుకు యంత్రములను (కరంటు తో నడిచేవి ) రాయితి పై జిల్లాలోని (32) రైతులకు 2020-21 సంవత్సరమందు అందించడము జరిగింది.
క్ర.సం. | అధికారి పేరు | హోదా | మొబైల్ నెంబరు | ఇ-మెయిల్ ఐ. డి |
---|---|---|---|---|
1 | డా. యం. భరత్ | పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి (FAC) | 9989997573 | dvahonzb@gmail.com |
2 | డా. యమ్.డి. బాలీగ్ అహ్మద్ | సహాయ సంచాలకులు (వి&ఎ హెచ్ ) | 9989997580 | dvahonzb@gmail.com |
క్ర.సం. | చికిత్సలు | Cumulative from April to July 2021 | ||
---|---|---|---|---|
లక్ష్యము | సాధించిన ప్రగతి | శాతము | ||
1 | చేయబడిన పశు చికిత్సల సంఖ్య. | 321850 | 324529 | 100.83 |
2 | ®వేయబడిన నట్టల నివారణ మందులు | 150685 | 146277 | 97.07 |
3 | విత్తులు కొట్టిన పశువుల సంఖ్య. | 1827 | 1822 | 99.73 |
4 | వేయబడిన టీకాల సంఖ్య. | 282836 | 288097 | 101.86 |
5 | కృత్రిమ గర్భదారణ | 13472 | 13100 | 97.24 |
6 | పుట్టిన దూడల సంఖ్య. | 5158 | 5161 | 100.06 |
7 | పంపిణీ చేసినా గడ్డివితనలు (Acers) | 1521 | 1670 | 109.80 |